అక్షరటుడే, ఇందూరు: విద్యార్థులకు ఉద్యోగాలను కల్పించడంలో ముందుంటామని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కళాశాల ప్రాంగణంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. తమ కళాశాలలో చదువుతోపాటు వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తున్నామన్నారు. అనంతరం టెక్ మహీంద్రా, జెన్ ప్యాక్ట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తదితర కంపెనీలో ఉద్యోగాలు పొందిన విద్యార్థులకు నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నం, టాస్క్ సమన్వయకర్త రామకృష్ణ, మ్యాజిక్ బస్ మేనేజర్ చందర్, ప్రతినిధులు రమేష్ సందీప్ తదితరులు పాల్గొన్నారు.