అక్షరటుడే, వెబ్ డెస్క్ : ముధోల్ లో డా. సిద్ధిక్ పెట్రోల్ బంక్ ఏర్పాటుకు శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ సిందే ఆనందరావు పటేల్ హాజరై భూమి పూజ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాజన్న, ముధోల్ మాజీ సర్పంచ్ రాజేందర్, రమేష్, రామనాథ్ నాయక్ పాల్గొన్నారు.