అక్షరటుడే, భిక్కనూరు: యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని భిక్కనూరు సౌత్‌ క్యాంపస్‌ ప్రిన్సిపాల్‌ సుధాకర్‌ గౌడ్‌ సూచించారు. ఈ మేరకు బుధవారం అవగాహన కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. డ్రగ్స్‌ వినియోగంతో యువత శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా నిర్వీర్యమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్‌ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ రాజేశ్వరి, ఎన్‌ఎస్‌ఎస్‌ ఆఫీసర్లు అంజయ్య, హరిత, వార్డెన్‌ సునీత, ఉమెన్‌ సెల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వైశాలి, అధ్యాపకులు పాల్గొన్నారు.