అక్షరటుడే, ఎల్లారెడ్డి: వసతి గృహాల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని డీఆర్‌డీవో సురేందర్ ఆదేశించారు. గురువారం లింగంపేటలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో వంటగది, విద్యార్థులకు అందిస్తున్న భోజనం పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆయన వెంట ఎంపీడీవో నరేష్, పాఠశాల సిబ్బంది ఉన్నారు.