అక్షరటుడే, ఇందూరు: డీఎస్సీ 2024 లో ఎంపికైన అభ్యర్థుల కౌన్సిలింగ్ యథావిధిగా కొనసాగనుంది. మంగళవారం జరగాల్సిన కౌన్సిలింగ్ ఉన్నతాధికారుల ఆదేశాలతో వాయిదా వేసినట్లు మొదట తెలిపిన విద్యాశాఖ అధికారులు, ప్రస్తుతం మళ్లీ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే పలువురు ఉపాధ్యాయులు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌కు వచ్చి వెనుతిరిగారు. మళ్లీ కౌన్సిలింగ్‌కు రావాలని పిలవడంతో అసహనం వ్యక్తం చేశారు.