అక్షరటుడే, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను ప్రభావంతో తిరుమల ప్రాంతంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ అకాల వర్షాల వల్ల స్థానిక ప్రధాన జలాశయాలు నిండుకుండలా మారాయి. గోగర్భం డ్యామ్ పూర్తిగా నిండిపోవడంతో అధికారులు గేట్లు తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు. పాపవినాశనం, ఆకాశగంగ, కుమారధార, పసుపుధార జలకళను సంతరించుకున్నాయి. వర్షాల వల్ల కొండచరియలు విరిగి పడటంతో శ్రీవారిమెట్టు, పాపవినాశనం మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు. రెండో ఘాట్ రోడ్డుపై రాళ్లు, చెట్లు పడిపోయాయి. వర్షాల వల్ల గదులు దొరక్క కొందరు భక్తులు బయటే తాత్కాలిక షెడ్లలో బస చేస్తున్నారు. కపిలతీర్థం వంటి ప్రవాహ ప్రదేశాల్లో ప్రవేశం నిలిపివేశారు.