అక్షరటుడే, జుక్కల్: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జుక్కల్ నియోజకవర్గంలోని పలుచోట్ల మొక్కజొన్న పంట నేలకొరిగింది. పెద్ద కొడప్ గల్, పిట్లం, జుక్కల్, బిచ్కుంద తదితర మండలాల్లో వివిధ చోట్ల మొక్కజొన్న పంట దెబ్బతిన్నది. మూడు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు చేతికి అందే మొక్కజొన్న పంట నేలకొరగడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి పంట నష్ట పరిహారం అందించాలని కోరుతున్నారు.