అక్షరటుడే, బాన్సువాడ: బీర్కూర్ మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా దుర్గం శ్యామల శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ సమక్షంలో కార్యక్రమం నిర్వహించారు. వైస్ ఛైర్మన్‌గా యామ రాములు, డైరెక్టర్లు ప్రమాణం చేశారు. పాలకవర్గం సభ్యులు రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని పోచారం సూచించారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.