అక్షరటుడే, ఇందూరు: జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఈనెల 27న జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు డీవైఎస్‌వో ముత్తెన్న తెలిపారు. జానపద నృత్యం, (జట్టు,వ్యక్తిగతం), జానపద పాటలు(జట్టు, వ్యక్తిగతం), కథ, రచన, పోస్టర్ మేకింగ్, పెయింటింగ్, హస్తకళలు, టెక్స్టైల్స్, వ్యవసాయ ఉత్పత్తులు తదితర అంశాల్లో పోటీలు ఉంటాయన్నారు. జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో పోటీలు జరుగుతాయన్నారు పోటీలో పాల్గొనేవారు 15 నుంచి 29 సంవత్సరాలలోపు ఉండాలని, జిల్లాస్థాయిలో ఎంపికైన వారు రాష్ట్రస్థాయిలో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. అలాగే 26న నగరంలోని మాణిక్ భవన్ పాఠశాలలో జిల్లాస్థాయి సైన్స్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇతర వివరాలకు 9701177144, 9848219365 నంబర్లను సంప్రదించాలన్నారు.