అక్షరటుడే, వెబ్​డెస్క్: ఇంజినీరింగ్​, అగ్రికల్చర్​, ఫార్మ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీ సెట్​ షెడ్యూల్ ఖరారు అయింది. ఈ నెల 20న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 25 నుంచి ఏప్రిల్ 4 వరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షలు, మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ ఎంట్రెన్స్​ టెస్ట్ ఉంటుంది.