అక్షరటుడే, ఎల్లారెడ్డి: పట్టణంలోని ఏద మినిస్ట్రీస్ లో శనివారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రదర్ శ్రీనివాస చారి, సిస్టర్ హెప్సిబా చారి ఆధ్వర్యంలో ప్రత్యేక ఆత్మీయ ఆశీర్వాద ప్రార్థనలు చేశారు. అనంతరం నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించి, పేద మహిళలకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బ్రదర్ జోసఫ్, జనరల్ సెక్రెటరీ విజయ్, పాస్టర్ బ్రదర్ భాస్కర్, వివిధ మండలాల క్రైస్తవులు పాల్గొన్నారు.