అక్షరటుడే, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. మహాబూబ్‌నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రిక్టర్ స్కేలుపై 3.0 తీవ్రతతో భూమి కంపించింది. కౌకుంట్ల మండలం దాసరపల్లి సమీపంలో కేంద్రంగా భూప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లోని గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.