అక్షరటుడే, హైదరాబాద్: బీదర్ నిందితుల కోసం సిటీ మొత్తం అలర్ట్ చేసినట్లు ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి స్పష్టం చేశారు. గురువారం రాత్రి ఆయన ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడారు. నిందితుల కోసం ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. హైదరాబాద్ అఫ్జల్ గంజ్ లో బీదర్ దొంగల ముఠా కాల్పుల ఘటన జరిగిన విషయం తెలిసిందే. దొంగల ముఠాను పట్టుకునేందుకు బీదర్ పోలీసులు హైదరాబాద్ వచ్చారు. అఫ్జల్ గంజ్ లో వారిని చూసిన దొంగలు తప్పించుకునే ప్రయత్నంలో కాల్పులు జరిపారు.