అక్షరటుడే, ఇందూరు: జిల్లాలోని గణిత ఉపాధ్యాయులకు ఈనెల 27న ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంప్ ఉన్నత పాఠశాలలో శిక్షణ ఇస్తున్నట్లు విద్యాశాఖ అధికారి అశోక్ తెలిపారు. గణిత ప్రయోగశాల ఏర్పాటు, నిర్వహణ, వినియోగంపై శిక్షణ ఉంటుందన్నారు. రాష్ట్ర రిసోర్స్ పర్సన్ లు సాయిలు, కృష్ణ, సతీష్ రెడ్డి, గోపాలకృష్ణ శిక్షణను ఇస్తారన్నారు. కావున ప్రతి గణిత కాంప్లెక్స్ నుంచి ఎంపిక చేయబడిన ముగ్గురు ఉపాధ్యాయులు హాజరు కావాలని సూచించారు.