అక్షరటుడే, వెబ్ డెస్క్: ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గి వాసుదేవ్ ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అత్యవసర బ్రెయిన్ సర్జరీ అనంతరం ఆయన ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న వీడియో బయటకు వచ్చింది. ఈ నెల 17న ఆయనకు బ్రెయిన్ సర్జరీ అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన సాధారణ స్థితికి చేరుకున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వీడియోలోనూ సద్గురు నవ్వుతూ చాలా ఉత్సాహంగా మాట్లాడారు.