అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : మహారాష్ట్ర, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. చివరి రోజు ప్రచారం మరింత వేడెక్కింది. ప్రత్యర్థుల వైఫల్యాలు ఇవేనని మహారాష్ట్ర వార్తపత్రికల్లో ఇచ్చిన యాడ్స్‌పై తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ఎన్నికల చివరి రోజు ఆయా పార్టీల అగ్రనేతలు ముమ్మురంగా ప్రచారం చేశారు. జార్ఖండ్‌ రాష్ట్రంలో రెండో విడత, మహారాష్ట్రలో ఈనెల 20న ఎన్నికలు జరగనున్నాయి.