అక్షరటుడే, బోధన్ : బోధన్ పట్టణాభివృద్ధి కమిటీ ఎన్నికలు ఈనెల 9వ తేదీన నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి పోశెట్టి పేర్కొన్నారు. బోధన్ పట్టణంలోని మహాలక్ష్మి మండపంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో బోధన్ పట్టణ వివిధ కులాల సంఘ నాయకులు, సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.