అక్షరటుడే, కోటగిరి: విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు నాణ్యమైన ఐఎస్ఐ గుర్తింపు పొందిన పరికరాలను వాడాలని విద్యుత్ శాఖ ఏఈ బుజ్జిబాబు సూచించారు. బోరు మోటార్లకు కెపాసిటర్లు ఏర్పాటు చేసుకోవాలని రైతులకు సూచించారు. కోటగిరి మండల శివారులో పంటలు సాగు చేస్తున్న రైతులతో శుక్రవారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పొలం బాట కార్యక్రమం నిర్వహించారు. ఏఈ మాట్లాడుతూ.. రైతులు విద్యుత్ పొదుపుగా వాడుకోవాలని, ప్రతి రైతు విద్యుత్ ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. విద్యుత్ సమస్యలుంటే తమకు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో లైన్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు, లైన్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు.