అక్షరటుడే, కామారెడ్డి: పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాల్లో ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులను రైగ్యులరైజ్ చేశారని.. తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదని సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్యోగులు ప్రశ్నించారు. కామారెడ్డిలో ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల దీక్షలు శనివారం 26వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఉద్యోగులు మున్సిపల్ ఆఫీస్ నుంచి ర్యాలీగా వెళ్లి నిజాంసాగర్ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో సాధ్యమైన రెగ్యులరైజేషన్ తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సంపత్ తదితరులు పాల్గొన్నారు.