అక్షరటుడే, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కలిశారు. కుమారుడు భద్రారెడ్డితో కలిసి డీకేతో ఆయన భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటో బయటకు వచ్చింది. ఇటీవలే ఆయన సీఎం రేవంత్ సలహాదారుతో భేటీ కావడంపై రకరకాల ప్రచారాలు జరిగాయి. తిరిగి డీకేను కలవడంతో కాంగ్రెస్‌లో చేరుతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇటీవల మల్లారెడ్డి కళాశాల భవనాలను అధికారులు కూల్చిన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ నేతలతో వరుస భేటీలు కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.