అక్షరటుడే, కామారెడ్డి: బైండోవర్‌ నిబంధనలు ఉల్లంఘించిన ఒకరికి రూ.10వేల జరిమానా విధించినట్లు ఎక్సైజ్‌ ఎస్‌హెచ్‌వో విక్రమ్‌ తెలిపారు. మాచారెడ్డి మండలం గజ్యానాయక్‌ తండాకు చెందిన లాలిని నాటుసారా తయారీ కేసులో గతంలో మాచారెడ్డి తహశీల్దార్‌ ఎదుట బైండోవర్‌ చేశారు. దీనిని ఉల్లంఘిస్తూ అయన మళ్లీ నాటుసారా తయారు చేస్తుండడంతో తహశీల్దార్‌ ఎదుట హాజరుపర్చగా అతనికి జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.