అక్షరటుడే, వెబ్ డెస్క్: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏకే మొగ్గు చూపుతున్నాయి. పీ-మార్క్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. మహారాష్ట్రలోని 288 సీట్లలో.. 154 సీట్లను భాజపా నేతృత్వంలోని ఎన్డీఏకే మెజారిటీలో ఉంది. I.N.D.I.A. కూటమి 128 సీట్లు, ఇతరులకు 6 సీట్లు వస్తాయి.

  • మ్యాట్రిజ్ అంచనా ప్రకారం.. ఎన్డీఏ 150 – 170 స్థానాలు సొంతం చేసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ 110 – 130 స్థానాలు, ఇతరులు 8 – 10 సీట్లను పొందే అవకాశం ఉందని అంచనా వేసింది.
  • చాణక్య ఎగ్జిట్ పోల్.. ఇరు కూటముల మధ్య గట్టి పోటీని సూచించింది. మహాయుతి కూటమికి 150 – 160 సీట్లు వస్తాయని అంచనా వేసింది. మహా వికాస్ అఘాడి 130 – 138 స్థానాలను కైవసం చేసుకుంటుందని పేర్కొంది. ఇతరులు 6 – 8 సీట్లు గెలుచుకుంటారని చెబుతోంది.

ఇక జార్ఖండ్‌లో..

  • మ్యాట్రిజ్ సర్వే ప్రకారం.. ఎన్డీఏకు 46 సీట్లు, భారత్‌కు 29 సీట్లు, ఇతరులకు 6 సీట్లు వస్తాయని తేలింది.
  • చాణక్య ఎగ్జిట్ పోల్.. ఎన్డీఏ కూటమికి 45 – 50 సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది. ఇండి కూటమి 35 – 38 స్థానాలను కైవసం చేసుకోవచ్చని తెలిపింది.
  • పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ ప్రకారం.. ఎన్డీఏ కూటమి అధికారాన్ని కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. 81 స్థానాలున్న అసెంబ్లీలో మెజారిటీ మార్కు 41 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొంది. NDA 42 – 48 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది.