అక్షరటుడే, ఎల్లారెడ్డి: పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో 51మందికి కంటి పరీక్షలు చేశారు. 18 మందికి అద్దాలు, ఆరుగురికి శస్త్ర చికిత్స అవసరం ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరిని సరోజినీ దేవి హాస్పిటల్​కు రిఫర్ చేసినట్లు కంటి వైద్యుడు హరికిషన్ తెలిపారు. ప్రతి గురువారం ఎల్లారెడ్డి ఆస్పత్రిలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తామని డాక్టర్ రవీంద్ర మోహన్ తెలిపారు.