అక్షరటుడే, వెబ్​డెస్క్​: అక్కడా.. ఇక్కడా కాదు.. ఏకంగా తెలంగాణ సచివాలయంలోనే నకిలీ ఉద్యోగులు దర్జాగా తిష్ట వేశారు. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఫేక్​ ఐడీ కార్డులు ధరించి సచివాలయంలోని ఆయా కార్యాలయాల్లో నకిలీ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తుండడం వింతగా మారింది. అలర్ట్​ అయిన సెక్యూరిటీ సిబ్బంది రోజుకో నకిలీ ఉద్యోగిని పట్టుకుంటున్నారు. గురువారం తాజాగా.. కొంపల్లి అంజయ్య అనే వ్యక్తి తహశీల్దార్​ పేరుతో సచివాలయంలో హల్​చల్​ చేయగా అతడిని పట్టుకుని సైఫాబాద్​ పోలీసులకు అప్పగించారు.