అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: దేశీయ స్టాక్ మార్కెట్లో పతనం కొనసాగుతోంది. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన ఇండెక్స్ లు.. తీవ్ర ఒడుదుడుకుల మధ్య సాగుతున్నాయి. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 460 పాయింట్లు, నిఫ్టీ 130 పాయింట్ల నష్టంతో కదలాడుతున్నాయి. నిఫ్టీ ఫిఫ్టీలో డాక్టర్ రెడ్డీస్, సిప్లా, సన్ ఫార్మా, విప్రో, హెచ్సీఎల్ టెక్, టాటా కన్జ్యూమర్, ఐచర్ మోటార్, బజాజ్ ఆటో, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్ లాభాలతో ఉండగా పవర్ గ్రిడ్, టాటా మోటార్, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్, ఎల్ టీ స్టాక్స్ ఒక శాతానికి పైగా నష్టంతో కొనసాగుతున్నాయి.