అక్షరటుడే, జుక్కల్: మహమ్మద్ నగర్ మండలంలోని తెల్గాపూర్ గ్రామంలో గురువారం రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సన్న రకం ధాన్యం విక్రయించిన రైతులకు బోనస్ జమ చేయడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రైతులు ఎర్ర లక్ష్మణ్, హనుమంతు, మంగ రాములు, దండ్ల సాయిలు, ఎర్ర రమేశ్, నర్సింలు, గంగారాం, వెంకట్, కోనాపల్లి రాజు పాల్గొన్నారు.