అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: నాంపల్లి కోర్టులో సినీ నటుడు అల్లు అర్జున్‌కు ఊరట లభించింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పీఎస్‌లో హాజరుకావాలన్న నిబంధన నుంచి న్యాయస్థానం ఆయనకు మినహాయింపు ఇచ్చింది. సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌కు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు సమయంలో నాంపల్లి కోర్టు ప్రతి ఆదివారం పోలీసుల ఎదుట హాజరుకావాలని షరతులు విధించింది. ఈ క్రమంలో భద్రత కారణాల దృష్ట్యా మినహాయింపు ఇవ్వాలని అల్లు అర్జున్‌ కోర్టును కోరారు. దీంతో ఆయనకు మినహాయింపు ఇచ్చింది. మరోవైపు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.