అక్షరటుడే, వెబ్‌డెస్క్: హైకోర్టు తనకు ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో సినీ నటుడు మంచు మోహన్‌బాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. జర్నలిస్ట్ పై దాడి ఘటనలో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైన విషయం తెలిసిందే. మోహన్‌బాబు స్టేట్‌మెంట్ రికార్డ్ కోసం పోలీసులు యత్నించగా.. ఆచూకీ లభ్యం కావడం లేదు. దీంతో ఆయన కోసం పోలీసులు వెతుకుతున్నట్లు తెలుస్తోంది.