అక్షరటుడే, వెబ్డెస్క్: దేశంలోని కోటి మంది గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా కల్పిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ శ్రమ్ పోర్టల్ కింద వారికి పథకం అమలు చేస్తామని తెలిపారు. దీంతో స్విగ్గి, జోమాటో, రాపిడో లాంటి సంస్థల్లో పనిచేస్తున్న గిగ్ వర్కర్లకు మేలు జరగనుంది.