అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: ఇందల్వాయి ఎస్సై మహేష్ పై కేసు నమోదైంది. తాను స్టేషన్ హౌజ్ ఆఫీసర్ గా పనిచేసే చోటనే ఎఫ్ఐఆర్ నమోదు కావడం గమనార్హం. కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ మహిళ ఆదివారం స్టేషన్ లో నిరసన తెలిపింది. ఎస్సై తనను మోసం చేశాడని ఆరోపించింది. ఆ వెంటనే ఎస్సై మహేష్ సిక్ లీవ్ పెట్టి వెళ్ళిపోయాడు. అనంతరం ఉన్నతాధికారులు విచారణ జరిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మంగళవారం రాత్రి కేసు నమోదు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఎస్సై అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు.