అక్షరటుడే, కామారెడ్డి: ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని మాయాబజార్ ప్రాంతంలో ఎలక్ట్రిక్ స్కూటీపై ఓ వ్యక్తి వెళ్తుండగా అకస్మాత్తుగా పొగలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన స్కూటీ యజమాని బండిని నిలిపివేశారు. అనంతరం ఒక్కసారిగా స్కూటీలో నుంచి మంటలు చెలరేగాయి. దీంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. మంటలను ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.