అక్షరటుడే, వెబ్‌డెస్క్: కేరళలోని కన్నూర్ జిల్లా అళికోడ్‌లోని నీర్కడవు ముచిరియన్ ఆలయంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన థెయ్యం ఉత్సవంలో ప్రమాదం చోటు చేసుకుంది. బాణసంచా ప్రమాదంలో 12 ఏళ్ల చిన్నారితో సహా ఐదుగురు గాయపడ్డారు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో పైనుంచి ఒక బాణసంచా జనం మధ్య పడి పేలడంతో ఈ ప్రమాదం జరిగింది.