అక్షరటుడే, వెబ్డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్లి రాష్ట్రానికి తీసుకొచ్చిన పెట్టుబడులపై ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ నాయకులు వారికి కౌంటర్ ఇస్తున్నారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులు చూసి బీఆర్ఎస్ నాయకుల కడుపు మండుతోంది అన్నట్లు హైదరాబాద్ వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పెట్టుబడులు చూసి కడుపు మంటా.. అయితే ఈనో వాడండి అంటూ హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలపై కేసీఆర్, కేటీఆర్ చిత్రాలను ముద్రించారు.