అక్షరటుడే, వెబ్‌డెస్క్: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఆర్డర్ చేసిన ఫుడ్‌పై, ఫీడ్‌బ్యాక్ రేటింగ్ ఇచ్చే అవకాశం ఉంది. ఫలానా ఫుడ్‌ను మన స్నేహితులకు రికమండ్ చేసే అవకాశం లేదు. ఈలోటును తీర్చేందుకు జొమాటో తాజాగా ‘రికమండేషన్స్ ఫ్రమ్ ఫ్రెండ్స్’ ఫీచర్‌ను తీసుకువచ్చింది. లేటెస్ట్ వెర్షన్ యాప్‌లో అందుబాటులో ఉంటుందని జొమాటో యాజమాన్యం తాజాగా తెలిపింది. ఈ ఫీచర్‌తో ఫ్రెండ్స్ రికమండ్ చేసిన రెస్టారెంట్లు, ఆహార పదార్థాలు జాబితాలో కనిపిస్తాయి.