Advertisement

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిల విడుదలకు తన వంతు సహకారం అందిస్తానని మాజీ మంత్రి, బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లా ప్రైవేట్​ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాల అసోసియేషన్​ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలో ఆయనను కలిశారు. మూడేళ్లుగా రీయింబర్స్​మెంట్​ నిధులు విడుదల చేయకపోవడంతో కాలేజీల నిర్వహణ భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉందని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీంతో స్పందించిన ఆయన ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లి, బకాయిలు విడుదలయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రైవేట్​ డిగ్రీ కళాశాలల అసోసియేషన్ అధ్యక్షుడు హరిప్రసాద్, సంజీవ్, మారయ్య గౌడ్, నిశిత రాజు, సూర్యప్రకాష్, శంకర్, జైపాల్ రెడ్డి, నరాల సుధాకర్, గిరి, దత్తు, శ్రీనివాస్, రషీద్, రమణ, వెంకటేష్ పాల్గొన్నారు.

Advertisement