అక్షరటుడే, హైదరాబాద్: 2014లో 51 శాతం ఉన్న బీసీ జనాభా.. పదేళ్లలో 46 శాతం ఎలా అయిందని అసెంబ్లీలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. తమ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన సర్వేలో కోటీ 85 లక్షల(51 శాతం) బీసీ జనాభా ఉందని గుర్తుచేశారు. ముస్లిం బీసీలు 10 శాతం కూడా కలిపితే, మొత్తం బీసీల సంఖ్య 61 శాతం ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కోటీ 64 లక్షలకు బీసీ జనాభా ఉన్నట్లు తప్పుడు లెక్కలు చూపుతున్నారన్నారు. ఇవి తప్పుడు లెక్కలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీనే చెబుతూ “సర్వే రిపోర్ట్‌ను తగలబెట్టండి” అని అన్నారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి ప్రజలను మిస్లీడ్ చేస్తున్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు.