అక్షరటుడే, బోధన్‌: ఉపాధ్యాయులు విద్యార్థుల శ్రేయస్సు కోసం పాటు పడాలని ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి సూచించారు. బోధన్‌ ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌లో శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందించాలని సూచించారు. నిర్లక్ష్యం చేసినట్లు గుర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే రైస్‌మిల్లర్ల అంశంపై సీరియస్‌గా స్పందించారు. కొందరు మిల్లర్ల తీరు వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తోందని మండిపడ్డారు. కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ సకాలంలో అందించాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.