అక్షరటుడే, ఆర్మూర్ : ఆటల్లో గెలుపు ఓటములు సహజమని, విద్యార్థులు క్రీడాస్ఫూర్తిని అలవర్చుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వేల్పూర్ మండలం మోతె గ్రామంలో ఎస్జీఎఫ్ మండల క్రీడలను మంగళవారం ఆయన ప్రారంభించారు. అంతకుముందు ఉత్తమ విద్యార్థులకు బహుమతులను అందజేశారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పీఈటీలు, విద్యార్థులు పాల్గొన్నారు.