అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. విధులకు ఆటంకం కలిగించారని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కౌశిక్ రెడ్డిపై ఎస్సై రాఘవేంద్ర ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గురువారం ఉదయం కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. అరెస్ట్ చేస్తారనే విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీశ్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో హరీష్ రావు కౌశిక్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళడానికి యత్నించగా ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కౌశిక్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు.