అక్షరటుడే, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో సామాన్యుల సొంతింటి కలపై మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్‌వేదికగా స్పందించారు. ‘సంపద పెంచే ఆలోచనలు మావి- ఉన్నది ఊడ్చే సావు తెలివితేటలు మీవి. మేము బంగారు బాతును చేతిలో పెడితే- మీరు పదినెలలకే చిప్పచేతిలో పేడితిరి. నీ పిచ్చి చేష్టలకు కొత్తవి కొనాలన్న- పాతవి అమ్మాలన్న భయమే. హైడ్రా దెబ్బకు హైదరాబాద్‌లో సామాన్యుల సొంతింటి కలలు కలగానే మిగిలిపాయే. మూసి ముష్టి పనులకు కొత్తగా కట్టేటోడు లేక కట్టినా కొనేటోడు లేక రియల్ బూమ్ కాస్త రియల్ బాంబులాయే. కాసులపై నీకక్కుర్తి నిర్ణయాలు- రాష్ట్రాన్ని అధోగతిపాలు చెయ్యబట్టే. నాడు నిత్యం కళకళలాడే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు- నేడు విలవిలలాడుతూ బోసిపోయే. పది నెలల పాపపు పాలనలో రాష్ట్రానికి ప్రతిరోజు నష్టమే. బంగారు తెలంగాణను బక్కచిక్కిస్తున్న నీ దౌర్బగ్యపు పాలనకు ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు తగ్గిన రిజిస్ట్రేషన్ శాఖలో రాబడి ఇవిగో సాక్ష్యాలు’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.