అక్షరటుడే, వెబ్డెస్క్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ సవాల్ విసిరారు. కేటీఆర్కు దమ్ముంటే శివారెడ్డిపల్లి రావాలన్నారు. ఎవరి ప్రభుత్వంలో ఎంత రుణమాఫీ అయ్యిందో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. పరిగి నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1000 కోట్ల రుణమాఫీ చేసిందని చెప్పారు. కేటీఆర్, హరీష్, కవిత లాటరీ బ్యాచ్ అని ఆయన విమర్శించారు.