అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ పేరిట రైతులను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా విమర్శించారు. రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో గురువారం పాత కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బిగాల మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పార్లమెంట్ ఎన్నికల సమయంలో జిల్లాల పర్యటనలో రైతులందరికీ రుణమాఫీ చేస్తామంటూ దేవుళ్లపై ఒట్లు పెట్టారని గుర్తుచేశారు. తీరా సగం మందికి మాఫీ చేయకుండా అన్నదాతలను మోసం చేశారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అందరికీ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నుడా మాజీ ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బీఆర్‌ఎస్ నగరాధ్యక్షుడు సిర్ప రాజు, నాయకులు సదానంద్, ఎనగందుల మురళి, సత్యపాల్ తదితరులు పాల్గొన్నారు.