అక్షరటుడే, కామారెడ్డి: బీఆర్ఎస్ ప్రమాద బీమా చెక్కులను మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ బాధిత కుటుంబాలకు అందజేశారు. కొన్ని రోజుల క్రితం మాచారెడ్డి మండలం లచ్చపేట్ కు చెందిన పార్టీ కార్యకర్తలు కైరంకొండ శివరాములు, జక్కుల రాంచంద్రం ప్రమాదవశాత్తు మరణించారు. వారి కుటుంబాలకు పార్టీ తరపున ప్రమాదబీమా చెక్కులను గంప గోవర్ధన్ చేతుల మీదుగా ఇచ్చారు. శివరాములు భార్య లక్ష్మి, రాంచంద్రం భార్య నీలవ్వకు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో మాచారెడ్డి మాజీ జడ్పీటీసీ మినుకురి రాంరెడ్డి, నల్లవెల్లి అశోక్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.