అక్షరటుడే, బిచ్కుంద: కాంగ్రెస్ తల్లి విగ్రహ స్థానంలో అసలు సిసలైన తెలంగాణ తల్లి(గత నమూనా) విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే డిమాండ్ చేశారు. మంగళవారం బిచ్కుంద మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి ఆయన పాలాభిషేకం చేశారు. జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు వెంకట్రావు దేశాయ్, బన్సీపటేల్, మాజీ జడ్పీటీసీ నాల్చర్ రాజు, సొసైటీ ఛైర్మన్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.