అక్షరటుడే, ఇందల్వాయి: ఇందల్వాయిలో మున్నూరుకాపు కల్యాణ మండపానికి మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత ఆదివారం భూమిపూజ చేశారు. ఆమె మాట్లాడుతూ మండల కేంద్రంలో కల్యాణ మండపం పూర్తయితే ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గుట్ట గంగాధర్, సాధు రవి, గంగాధర్, శ్రీనివాస్, గోపాల్, రాజన్న, గంగారాం, విఠల్ పాల్గొన్నారు.