అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: తెలంగాణ తల్లి విగ్రహం మార్పు రాష్ట్ర అస్తిత్వంపై దాడిచేయడమేనని మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ అన్నారు. ఇదివరకు ఉన్న తెలంగాణ తల్లి రూపంపై ఉన్న అభ్యంతరమేమిటని ప్రశ్నించారు. కేటీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ ఛైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, నగర అధ్యక్షుడు సిర్ప రాజు, రాంకిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.