అక్షరటుడే, కోటగిరి: యువత స్వామి వివేకానంద స్ఫూర్తితో ముందుకు సాగాలని హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద అన్నారు. కోటగిరి వివేకానంద హైస్కూల్‌లో రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివేకానంద విగ్రహాన్ని మంగళవారం విగ్రహ దాత, మాజీ ఎంపీ బీబీ పాటిల్, స్వామిజీతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో సామాజిక సమరసత వేదిక కన్వీనర్ అప్పల ప్రసాద్, పీవీ సుబ్బారావు, ఖర్గే శ్రీనివాస్, వివేకానంద స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు గోగినేని రజిని శ్రీనివాస్, ఇందూరు స్కూల్ కరస్పాండెంట్ కొడాలి కిషోర్, పోల విఠల్ రావు పాల్గొన్నారు.