అక్షరటుడే, వెబ్​డెస్క్​: టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్​, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్​ ప్రభుత్వ అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్​ఎస్​ హయాంలో పెత్తనం చేసిన పలువురు అధికారులు ఇప్పుడు ఆ పార్టీకి కోవర్టులుగా పని చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో పనిచేసిన అధికారులు ఇప్పుడు కూడా అవే స్థానాల్లో ఉన్నారన్నారు. వారు కీలక సమాచారాన్ని ప్రతిపక్ష పార్టీకి చేరవేస్తున్నారని ఆరోపించారు. జీఎస్టీ స్కామ్​లో అక్రమాలకు పాల్పడిన మాజీ సీఎస్​ సోమేశ్​కుమార్ పై​ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు రాజలింగమూర్తి హత్య కేసులో పోలీసుల వైఫల్యం ఉందని ఆయన పేర్కొన్నారు.