అక్షరటుడే, ఎల్లారెడ్డి: మండలంలోని రుద్రారం ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు 80 కుర్చీలను, బ్లాక్ బోర్డులను మాజీ మున్సిపల్ ఛైర్మన్ కుడుముల సత్యనారాయణ మంగళవారం అందజేశారు. గ్రామ యువ నాయకులు సమస్యలను మాజీ మున్సిపల్ ఛైర్మన్ దృష్టికి తీసుకురావడంతో ఆయన స్పందించారు. పాఠశాల విద్యార్థులకు అసౌకర్యాలు లేకుండా కూర్చోవడానికి కుర్చీలు, బ్లాక్ బోర్డ్స్ వితరణ చేశారు. విద్యార్థులు చదువులపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన సూచించారు. ప్రభుత్వం నుంచి సైతం అన్ని వసతులు కల్పించేలా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ రజిత వెంకటరామిరెడ్డి, సామెల్, జైపాల్ రెడ్డి, పద్మారావు తదితరులున్నారు.