Advertisement
అక్షరటుడే, వెబ్‌డెస్క్: విమానంలో అస్వస్థతకు గురైన మహిళకు నిజామాబాద్ జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ అత్యవసర చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో హైదరాబాద్‌కు చెందిన అనురాధకు హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో ప్రతిమారాజ్ విమాన సిబ్బంది అందించిన మెడికల్ కిట్‌తో చికిత్స చేశారు. డాక్టర్ ప్రతిమారాజ్‌ను విమాన సిబ్బంది, ప్రయాణికులు అభినందించారు.
Advertisement